
ఆంధ్ర ప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతంలో 11 మంది కొట్టుకుపోయారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కార్తీకమాసం కావడంతో కొంతమంది జలపాతం దగ్గర విహార యాత్రకు వెళ్లారు. జలపాతంలో దిగి ఎంజాయి చేస్తుండగా అలల తాకిడికి కొట్టుకుపోయారు. అయితే ఇందులో ఒక అమ్మాయి రాయిని పట్టుకొని ప్రాణాలు రక్షించుకోగలిగిందని సమాచారం అందుతోంది. జలపాతం కొంచెం ఎత్తులో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంకా పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.